Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅడ్డ‌గుట్ట ప‌రిస‌రాల్లో లాలాగూడ పోలీసుల కవాతు

అడ్డ‌గుట్ట ప‌రిస‌రాల్లో లాలాగూడ పోలీసుల కవాతు

📰 Generate e-Paper Clip

అడ్డగుట్ట, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :   గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ప్రజలకు భద్రతాభావం కల్పించడం కోసం లాలాగూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అడ్డ‌గుట్ట ప్రాంతంలో శుక్ర‌వారం ఫ్లాగ్ మార్చ్ ( కవాతు ) నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిల‌క‌ల‌గూడ డివిజ‌న్ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి మాట్లాడుతూ… పండుగలను అందరూ శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిస్తూ ఆయ‌న భరోసానిచ్చారు. పోలీసులకు, సాధారణ ప్రజలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించడం జ‌రుగుతుంద‌న్నారు. పండుగ సమయాల్లో జనసమద్దం ఎక్కువగా ఉండే మార్గాలను ముందుగానే గుర్తించి, వ్యూహాత్మకంగా భద్రతను ఏర్పాటు చేయడం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

పోలీసు విభాగంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం పెరగడానికి, క్రమశిక్షణను పెంపొందించడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. పండుగలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భద్రతాభావం కల్పించడం ఫ్లాగ్ మార్చ్‌ ప్రధాన ఉద్దేశమ‌న్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు, అసాంఘిక శక్తుల మనసులో భయాన్ని కలిగించి, నేరాలను ముందే అరికట్టడమ‌వుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో లాలాగూడ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ ర‌వి కిర‌ణ్‌, డిఐ, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page