సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ జ‌యంతి, అన్న‌దానం

సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో
అంబేద్క‌ర్ జ‌యంతి, అన్న‌దానం

భోల‌క్‌పూర్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి గుండెల్లి దేవి వ‌ర ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ ఇందిరాన‌గ‌ర్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్రమానికి క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్, సికింద్రాబాద్ డిసిసి అధ్య‌క్షుడు దీపక్ జాన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరవింద్ కుమార్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. కులమత విభేదాలు లేకుండా జ‌రిగిన బంతి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుండెల్లి నాగభూషణం, టి ఎంఆర్‌పిఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఇటుక రాజు మాదిగ‌, టిహెచ్ఎండి అధ్య‌క్షుడు క‌న‌క‌రాజు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page