ముషీరాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి
ముషీరాబాద్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంటల రాజు, మోయిన్, శ్రీనివాస్ యాదవ్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజెయ్ ముదిరాజ్, డేగల బిక్షపతి యాదవ్, కొండా సహదేవ్, బూడిది లక్ష్మణ్ గౌడ్, ముత్యం బాల్‌రాజ్ గౌడ్, బియ్యం శ్రీనివాస్, భాషపాక శ్రీనివాస్, సదా, దీన్‌దయాల్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply