తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా పటిష్టపర్చడం కోసం క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జ్‌ల నియామ‌కాలు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా పటిష్టపర్చడం కోసం క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జ్‌ల నియామ‌కాలు


హైదరాబాద్, ఆగ‌స్టు 17, అద్దం న్యూస్ :   తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా పటిష్టపర్చడం కోసం క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జ్‌ల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. ష‌హర్ హమారా ! హైదరాబాద్ హమారా ! మేయర్ హమారా ! అనే నినాదాంతో తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో భాగంగా సంస్థాగతంగా పటిష్టపర్చడం కొరకు అధిష్టానం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా 25 వేల ఓటర్లకు ఒక క్లస్టర్ ఇన్చార్జ్‌ను నియమించాలని నిర్దేశించడం జ‌రిగింది. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గ సమావేశం ఆదివారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంటు అధ్యక్షుడు పి.సాయిబాబా ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సమావేశానికి ముషీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పార్లమెంట్‌ లీగల్ సెల్ అధ్యక్షుడు కె.పరుశురామ్ హాజరై క్లస్టర్ ఇన్చార్జ్‌ల‌ ఎన్నికల ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ సమావేశం అనంతరం సాయిబాబా మాట్లాడుతూ… రాబోయో స్థానిక సంస్థల ( జిహెచ్ఎంసి ) ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ విజయం సాధించే లక్ష్యంగా ఇప్పటి నుండే సమాయత్తమవుతోందని తెలిపారు. ష‌హర్ హమారా ! హైదరాబాద్ హమారా ! మేయర్ హమారా ! అనే నినాదంతో పార్టీని క్షేత్ర స్థాయి నుండి పటిష్ట పరుస్తూ ఈ క్లస్టర్ ఇన్చార్జ్‌ల‌ను నియామకం చేపట్టిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉన్నా… లేకపోయానా… తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా అన్ని స్థానాల నుండి పోటీ చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లను 25 వేలకు ఒక క్లస్టర్‌గా ఏర్పరిచి దానికి ఒక ఇన్చార్జ్‌ను నియమించి క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం పటిష్టం చేసి ఎన్నికల్లో విజయం సాధించడానికి తగిన వ్యూహలు, ప్రతిపాదనలు రూపొందించామ‌న్నారు.                    ఈ స‌మావేశంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎంకె.బోసు, పరుశురామ్, ఎస్.ప్రకాష్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్ గౌడ్, బి.రాజు, జి.శంకర్, చిత్ర, మగ్గి యాదగిరి, సుక్రవేది, రవి గౌడ్, సత్యనారాయణ, కృష్ణస్వామి, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page