ఆర్‌టిసి క్రాస్ రోడ్ లో బహుజన వామపక్ష కార్మిక సంఘాల ప్రదరన, ధర్నా
ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా సమరనినాదాన్ని మోగించిన కార్మికవర్గం
– సంఘిభావం తెలియజేసిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ మహిళా, సినిమా వేదికలు, సర్పంచుల సంఘం

హైదరాబాద్, జులై 9, అద్దం న్యూస్ : దేశానికి, దేశప్రజలకు, కార్మికవర్గానికి ఉపయోగపడే 44 కార్మిక చట్టాల స్థానంలో కార్మిక చట్టాల సవరణల పేరిట కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ప్రమాదకరమైన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఆర్‌టిసి క్రాస్ రోడ్ లో కార్మిక ప్రదర్శన, ధర్నా జరిగింది. బహుజన వామపక్ష జేఏసి, టిబిఎన్‌సికెయు చర్చల చంద్రన్న ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఎఫ్‌టియు నాయకుడు షేక్ షావలి, ఏఐఎఫ్‌టియు నాయకుడు వై.మల్లేష్, ఏఐసిటియు నాయకుడు టి.అనిల్ కుమార్, టియుసిఐ నాయకుడు డి.రాజేష్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సెక్రటరి జనరల్ తుమ్మల ప్రపుర్ రాంరెడ్డి, సర్పంచుల సంఘం నాయకుడు మంచాల వెంకటస్వామి, తెలంగాణ మహిళా ఉద్యమకారుల వేదిక నాయకురాలు బాకారం లావణ్య, సుజి, సుచరిత, ఆడజన సమాఖ్య ధనలక్ష్మి, తెలంగాణ సినిమా వేదిక లారా, సాయిలు, భిక్షపతి, రఘ, కన్నలక్షి, బైరి గోదావరి తదితరులు సంఘీభావం తెలియజేసిన వారీలో ఉన్నారు. చిక్కడపల్లిలో గల టియుజేఏసి కేంద్ర కార్యాలయం నుండి ఆర్‌టిసి క్రాస్ రోడ్ వరకు జరిగిన ప్రదర్శనలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…కేంద్రంలో బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ చట్టబద్ద ప్రజావ్యతిరేక విధానాల పట్ల తీవ్రంగా మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్స్ ను ఎత్తివేసి, పాత చట్టాలనే అమలుచేయాలని, సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పనిగంటల పెంపును రద్దుచేసి, 8 గంటల పనివిదానం అమలుచేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించి, ప్రవేటీకరణ, యాంత్రీకరణ విధానాలను వదులుకోవాలని, సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భధ్రతలో బాగంగా పెన్షన్, పీఎఫ్, ఇఎస్ఐ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గని, బీడి కార్మిక చట్టాల పరిరక్షణ, కనీస వేతనం 26 వేల రూపాయల ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ చేపట్టాలని, తెలంగాణ ఉద్యమ కారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, 250 గజాల ఇంటిస్థలం, గుర్తింపు కార్డు, నిరుద్యోగ, ఉపాది అమలులో బాగంగా ఒక కోటి రూపాయాల ఆర్థిక సహకారం తదితర ప్రజాస్వామికమైన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సమర నినాదాలతో కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఖాసిం, రాజేష్ కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఆలపించిన పోరాట పాటలు ఉర్రూతలూగించి, ఎంతగానో ఆలోచింపజేశాయి.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply