ముషీరాబాద్, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : వినాయక నవరాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శ్రీకృతి, దక్ష, జాను, జతిన్ తదితరులు భరత నాట్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కుషాల్ గౌడ్ ఆధ్వర్యంలో కళాకారులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సంతోష్, కౌస్తుబ, సాయి, కార్తీక్, శివ తదితరులు పాల్గొన్నారు.


