Wednesday, September 23, 2026
No menu items!
HomeGREATER HYDERABADవామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత తక్షణ కర్తవ్యం – వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక...

వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత తక్షణ కర్తవ్యం – వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక కన్వీనర్ చంద్రకుమార్

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) :     వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత తక్షణ కర్తవ్యమ‌ని వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ జ‌స్టిస్‌ చంద్ర‌కుమార్ అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక ( ULD ) ఆధ్వర్యంలో మంగళవారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ జ‌స్టిస్‌ చంద్ర‌కుమార్ మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాతంత్ర, సామాజిక లౌకిక శక్తుల ఏకీకరణ, ఐక్యత అత్యంత అవశ్యకమని అన్నారు. దేశంలో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర సమస్యలలో మునిగి ఉన్నారన్నారు. దేశ ప్రజల మంచి కోసం, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక కృషి చేయనున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక భవిష్యత్ కార్యాచరణను రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ప్రకటించారు. దీనిలో భాగంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యత యొక్క ఆవశ్యకత వివరిస్తూ అక్టోబర్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో, ప్రధాన కేంద్రాల్లో సదస్సులు, సమావేశాలు, వివిధ రూపాలలో కార్యక్రమాలు నిరహిస్తున్నామని తెలిపారు. పార్టీలు, శక్తుల వారితో సమన్వయం చేసుకునేలా, ప్రజా ఉద్యమాలకు, ఆందోళనలకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వడం కోసం కృషి చేస్తామని తెలిపారు.   రాష్ట్రంలో నిరుద్యోగులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమి చేయాలో సూచిస్తూ, వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల పరిరక్షణ కమిటీలను, నిరుద్యోగ సంఘాలను సమన్వయం చేయనున్నట్లు తెలిపారు. ఈ విలేక‌రుల స‌మావేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక నాయకులు ప్రొఫెసర్ వెంకట దాస్, బొజ్జా బిక్షమయ్య, కోలా జనార్ధన్, డాక్టర్.ఎస్.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page