Sunday, September 20, 2026
No menu items!
HomeసామాజికంBiryani Ice Cream: బిర్యానీతో ఐస్‌క్రీమా..? సోషల్ మీడియాలో వైరల్!

Biryani Ice Cream: బిర్యానీతో ఐస్‌క్రీమా..? సోషల్ మీడియాలో వైరల్!

📰 Generate e-Paper Clip

Biryani Ice Cream: బిర్యానీతో ఐస్‌క్రీమా..? సోషల్ మీడియాలో వైరల్!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  సోషల్ మీడియా యుగంలో ఫుడ్ బ్లాగర్స్ చేసే ప్రయోగాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా అందరికీ ఇష్టమైన బిర్యానీని, చల్లని ఐస్‌క్రీమ్‌గా మార్చి ఓ వ్లాగర్ నెటిజన్లను షాక్‌కు గురిచేశారు. “బిర్యానీ ఐస్‌క్రీమ్” (Biryani Ice Cream) పేరుతో తయారైన ఈ విచిత్రమైన వంటకం వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా స్ట్రీట్ వెండర్స్ చేసే ఐస్‌క్రీమ్ రోల్స్ లాగా కాకుండా, ఈ వ్లాగర్ శాస్త్రీయ పద్ధతిలో బిర్యానీ రుచిని ఐస్‌క్రీమ్‌లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకోసం నూనెలో ఉప్పు వేసి ఉల్లిపాయలను (Fried Onions) వేయించి, అన్నాన్ని క్రీమ్‌తో (Biryani Icecream) కలిపి ఉడికించారు. ఆ తర్వాత పంచదార, బిర్యానీ మసాలా, ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి మిక్సీ పట్టి, వడగట్టిన మిశ్రమాన్ని ఫ్రీజ్ చేశారు. చివరగా, తయారైన ఐస్‌క్రీమ్‌పై నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు, బాదం పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు “ప్రతిదీ చేయగలమని ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు” అని విమర్శిస్తుండగా, మరికొందరు “ఇందులో చికెన్, గుడ్లు మిస్ అయ్యాయి” అంటూ చమత్కరిస్తున్నారు. బిర్యానీ (Biryani Icecream) ప్రియులు మాత్రం తమ అభిమాన వంటకాన్ని ఇలా మార్చడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ బిర్యానీ ఐస్‌క్రీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Biryani Ice Cream: Ice cream with biryani? Viral on social media!

Biryani Ice Cream, social media, Telugu Latest News, Latest Telugu News, Telugu News, Breaking News, breaking news today,

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page