Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADవంగిపోయి దూరమవుతున్న కొమ్మను గట్టిగా పట్టుకోకు – కైలాష్ నాగేష్ రాసిన వ్యాసం

వంగిపోయి దూరమవుతున్న కొమ్మను గట్టిగా పట్టుకోకు – కైలాష్ నాగేష్ రాసిన వ్యాసం

📰 Generate e-Paper Clip

వంగిపోయి దూరమవుతున్న కొమ్మను గట్టిగా పట్టుకోకు
కొన్నిసార్లు వదిలేయడమే ఏకైక మార్గం

 నసుకు దగ్గరైన వ్యక్తి దూరమవుతున్నప్పుడు, ఒక బంధం క్రమంగా బలహీనపడుతున్నప్పుడు లేదా…. మనం ఎంతో ఆశతో ఎదురుచూసిన విషయం మనకు దక్కనప్పుడు. దాన్ని నిలబెట్టుకోవడానికి మనం మరింత బలంగా పట్టుకుంటాం.. కానీ కొన్ని విషయాలు మనం ఎంత ప్రయత్నించినా మన వద్ద నిలవవు. దూరమవ్వాలని నిర్ణయించుకున్న మనిషిని ప్రేమతోనైనా.. బాధతోనైనా.. త్యాగంతోనైనా శాశ్వతంగా మన వద్ద ఉంచలేం. ఎందుకంటే నిజమైన బంధం బలవంతంతో కాదు, పరస్పర ఇష్టంతో నిలుస్తుంది. చాలామంది వదిలేయడాన్ని ఓటమిగా భావిస్తారు. కానీ నిజానికి ప్రతి సందర్భంలో పోరాడటమే ధైర్యం కాదు. కొన్నిసార్లు మనల్ని మనం కాపాడుకోవడం కోసం, మనశ్శాంతిని నిలబెట్టుకోవడం కోసం, మనకు నొప్పి ఇస్తున్న దాన్ని వదిలేయడం కూడా ఒక గొప్ప ధైర్యం. చెట్టు నుండి విడిపోయిన ఆకు గాలిలో తేలుతూ కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్లే.. జీవితంలో కొన్ని విడిపోవడాలు కూడా మనలను కొత్త మార్గాల వైపు నడిపిస్తాయి. ఆ క్షణంలో అది నష్టంగా అనిపించినా, కాలం గడిచాక అదే నిర్ణయం మన ఎదుగుదలకు కారణమైందని అర్థమవుతుంది. నీ కోసం ఉండాల్సింది నిన్ను వదిలి వెళ్లదు. వెళ్లిపోవాల్సింది ఎంత గట్టిగా పట్టుకున్నా నిలవదు. అందుకే… దూరమవుతున్న దానిని బలవంతంగా పట్టుకోవడం కంటే వదిలేయాల్సిన సమయం ఎప్పుడు వచ్చిందో గుర్తించడం జీవితం నేర్పే గొప్ప జ్ఞానం. కొన్ని తలుపులు మూసుకుపోవడం శిక్ష కాదు… నీ కోసం తెరుచుకోబోయే కొత్త తలుపులకు ప్రకృతి ఇచ్చే స్థలం.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page