హైదరాబాద్, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ : తెలంగాణలో బిజెపియే ప్రత్యామ్నాయమని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ అన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ డివిజన్ మహాత్మానగర్ బస్తీలో 129 బూత్‌లో పార్టీ జెండావిష్కరణ జరిగింది. బిజెపి ఓబిసి మోర్చ నాయకుడు బిజ్జి కనకేష్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి బిజెపియేనే ప్రత్యామ్నాయం అని అన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు రాజశేఖర్, బిజెపి సీనియర్ నాయకులు ఆర్.విశ్వం, కృష్ణ, నందగిరి నర్సింహా, మోహన్, నిత్యానంద్, సత్తి, ధర్మేందర్, విజయ్, శివ, లక్ష్మణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply