రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని, స్వేచ్ఛను కల్పించిన ఏకైక పార్టీ బిజెపి
– మాజీ కార్పొరేటర్ పావని
హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని, స్వేచ్ఛను కల్పించిన ఏకైక పార్టీ బిజెపి అని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని అన్నారు. బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీనగర్ డివిజన్‌లో పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ పావని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన నివాసం పై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భారత దేశంలో 1980 ఏప్రిల్ 6న అతిపెద్ద రాజకీయపార్టీగా భారతీయ జనతా పార్టీ ( బిజెపి ) ఏర్పడిందన్నారు. దేశాన్ని శక్తివంతమైన ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్ది పౌరులందరికీ కుల, మత, లింగ భేదాలు లేకుండా స్వేచ్ఛను కల్పించడం పార్టీ ఆశయాలుగా పెట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply