అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న
బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లి బాపూనగర్ బస్తీలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ 42వ వార్షికోత్సవ ముగింపు వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. గత మూడు రోజులుగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారని, నేడు అన్నదానంతో వేడుకలు పూర్తి అయ్యాయని, అమ్మవారి దీవెనలు ప్రజలపై ఎల్లపుడూ ఉంటాయని వినయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సాయి కుమార్, నీరజ్, ఆలయ కమిటీ చైర్మన్ జి.దామోదర్, అధ్యక్షుడు సదానంద్, కమిటీ సభ్యులు రాజు, సుదర్శన్ రెడ్డి, సురేష్, అశోక్, జి.కృష్ణ కాంత్, గణేష్, బబ్బి తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply