దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు

హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని హనుమాన్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా దేవి మండపంలో నవరాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజలకు ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హాజరై బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు దామోదర్, అనుషా, మండపం నిర్వాహకులు శంకర్ గౌడ్, సందీప్ గౌడ్, ఉత్తమ్, ప్రకాష్, ప్రవీణ్, అరుణ్, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply