ఈ నెల 20న శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో బోనాల ఉత్స‌వాలు – 21 న రంగం

ఈ నెల 20న శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో బోనాల ఉత్స‌వాలు 

21 న రంగం, భ‌విష్య‌వాణి


ఈ నెల 20న శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో బోనాల ఉత్స‌వాలు – 21 న రంగం

బోనాల‌కు సంబంధించిన బ్రోచ‌ర్‌ను ఆవిష్క‌రిస్తున్న ఆల‌య వ్య‌వ‌స్థాప‌క కుటుంబ స‌భ్యుడు గోల్కొండ గౌత‌మ్ కుమార్‌, ఆల‌య ఈవో సాంబ‌శివ‌రావు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు సాత్విక్ శ‌ర్మ‌


హైదరాబాద్, జులై 17, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ న‌గ‌రంలో వంద‌ల సంవ‌త్స‌రాల ప్ర‌సిద్ధి చెందిన లోయ‌ర్ ట్యాంక్‌బండ్ శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో ఈ నెల 20వ తేదీన బోనాల ఉత్స‌వాలు, 21 వ తేదీన రంగం, భ‌విష్య‌వాణి జ‌రుగ‌నుంది. ఈ ఉత్స‌వాల‌కు సంబంధించిన బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం గురువారం క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య వ్య‌వ‌స్థాప‌క కుటుంబ స‌భ్యుడు గోల్కొండ గౌత‌మ్ కుమార్‌, ఆల‌య ఈవో సాంబ‌శివ‌రావు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు సాత్విక్ శ‌ర్మ‌, సీనియ‌ర్ అసిస్టెంట్ స‌తీష్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… బోనాల పండుగ ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఈ నెల 20వ తేదీన అమ్మ‌వారికి బోనాల స‌మ‌ర్ప‌ణ ఉంటుంద‌న్నారు. ఈ బోనాల పండుగ‌కు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్ల‌ను చేసిన‌ట్లు తెలిపారు. బోనాల‌తో వ‌చ్చే భ‌క్తుల కోసం ప్ర‌త్యేక క్యూ లైన్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ పోలీసులు బారీ కేడ్ల‌ను ఏర్పాటు చేశార‌న‌న్నారు. అమ్మ‌వారికి బోనాల స‌మ‌ర్ప‌ణ, పోత‌రాజుల విన్యాసాలు ఉంటాయ‌న్నారు. అనంత‌రం మ‌ళ్లి సాఫిగా భ‌క్తులు బ‌య‌ట‌కు వెళ్లే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. అదే రోజు అమ్మ‌వారికి పంచామృతాభిషేకం, ప్ర‌త్యేక సుగంధ‌బ‌రిత పుష్పాలంక‌ర‌ణ‌, బాల‌భోగం త‌దిత‌ర పూజ‌ల‌తో పాటు రాత్రి 12 గంట‌లకు అమ్మ‌వారికి నిషీపూజ బ‌లిహ‌ర‌ణ ద్వార‌బంధ‌నం ఉంటుంద‌న్నారు. 21వ తేదీన అమ్మ‌వారికి పంచామృతాభిషేకం, ప్ర‌త్యేక‌మైన ర‌క్తాక్షి అలంక‌ర‌ణ‌, బాల‌భోగం ఉంటుంద‌న్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆల‌య నుంచి ఘ‌టం ఊరేగింపు ఉంటుంద‌ని, పింగ‌ళి వెంక‌ట‌రెడ్డి ఫంక్ష‌న్‌హాల్ వ‌ర‌కు వెళ్లి త‌ర్వాత ఆల‌య ప్ర‌వేశం ఉంటుంద‌ని తెలిపారు. అదే రోజు రాత్రి ఆల‌య ప్రాంగ‌ణంలో రంగం భ‌విష్య‌వాణి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ముస్తాబైన శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యం ¦



హైద‌రాబాద్ న‌గ‌రంలో వంద‌ల సంవ‌త్స‌రాల ప్ర‌సిద్ధి చెందిన లోయ‌ర్ ట్యాంక్‌బండ్ శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో ఈ నెల 20వ తేదీన బోనాల ఉత్స‌వాలు, 21 వ తేదీన రంగం, భ‌విష్య‌వాణి జ‌రుగ‌నుంది. ఈ ఉత్స‌వాల‌కు క‌న‌కాల క‌ట్ట మైసమ్మ వారి దేవాల‌యాన్ని అంగ‌రంగంగా ముస్తాబు చేస్తున్నారు. రంగులు వేసి విద్యుత్ దీపాల‌తో అలంక‌రిస్తున్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page