కవాడిగూడలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
హైదరాబాద్, జులై 13, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడలో బోనాల పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కవాడిగూడ మున్సిపల్ గ్యారేజ్‌లో యాదగిరి, రమేష్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌టియు అధ్యక్షుడు రాంబాబు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వగోపి, బల్లెకరి రమేష్, శివ, చిన్న, వెంకటేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply