...

ఎవ‌రైతే క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తారో వారికే బూత్‌ల‌ను ఇస్తాం – పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌ను డిస్ట‌ర్బ్ చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి – రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్

ఎవ‌రైతే క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తారో వారికే బూత్‌ల‌ను ఇస్తాం 
– పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌ను డిస్ట‌ర్బ్ చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి

హైద‌రాబాద్‌, మే 24, అద్దం న్యూస్  ఎవ‌రైతే పార్టీ కోసం, ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తారో వారికే బూత్‌ల‌ను ఇస్తామ‌ని రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పార్టీలో ఉన్న‌ కార్య‌క‌ర్త‌ల‌ను డిస్ట‌ర్బ్ చేసి పార్టీ విచ్ఛినం కోసం కుట్ర‌లు చేసే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలని అనిల్ యాద‌వ్ కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గం బి బ్లాక్ స్థాయి సమావేశం అడిక్‌మెట్‌ డివిజన్ లలితానగర్ కమ్యూనిటీహాల్‌లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ నిర్వ‌హించే ప్రతి సమావేశానికి వచ్చే సమయంలో మీతో పాటు నలుగురు, ఐదుగిరిని తీసుకురావాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీలో కార్యకర్తలను డిస్టర్బ్ చేసే వారి పై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సికింద్రాబాద్ డిసిసి జిల్లా ప‌రిశీల‌కుడు సిద్ధేశ్వ‌ర్‌ను అనిల్ యాద‌వ్‌ కోరారు. ప్రతి బూత్‌లో మీ మీ బలగాన్ని బలంగా చేసుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. రేపటి నుండి ఒక్క గంట కేటాయించి మీ మీ డివిజన్లల్లో నెల‌కొన్న ప్ర‌జా సమస్యలను గుర్తించాలని, ఆ సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే నేను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తా అని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. పాశం అనిల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు అంజి యాదవ్, మాజీ కార్పొరేటర్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ సింగ్, అతినగరం సుదేశ్ నేత, లోకేష్ యాదవ్, కేశవ్, లింగం గుప్త‌, సికింద్రాబాద్ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కవిత, అడిక్‌మెట్ డివిజ‌న్ అధ్య‌క్షుడు తిరుమ‌ల్‌రావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు సంగపాక వెంకట్, సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి మీసాల జయకుమార్, అన‌సూయ‌, రాజ్‌దీప్‌, ర‌మేష్ గౌడ్‌, నాగ‌భూష‌ణం, గోవింద్‌, వ‌ల్ల‌భ్‌రెడ్డి, విజ‌య్, బి బ్లాక్ పరిధిలోని అడిక్‌మెట్‌, రాంనగర్, ముషీరాబాద్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చాతకాకపోతే అధ్యక్షులు తప్పుకోండి :
కాంగ్రెస్ సికింద్రాబాద్ డిసిసి జిల్లా ప‌రిశీల‌కుడు సిద్ధేశ్వ‌ర్‌

స‌మావేశానికి హాజ‌రైన కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు

                                        స‌మావేశానికి హాజ‌రైన కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు

చాతకాకపోతే అధ్యక్షులు తప్పుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి జిల్లా ప‌రిశీల‌కుడు సిద్ధేశ్వ‌ర్ అన్నారు. అడిక్‌మెట్ ల‌లితాన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో బి బ్లాక్ ప‌రిధిలోని మూడు డివిజ‌న్ల‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా సిద్ధేశ్వర్ మాట్లాడుతూ… పని చేయడం ఇష్టం లేకపోతే వేరే వారికి అవ‌కాశం ఇవ్వండి అని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగాలేదని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు ఆరు నెలల్లో రాబోతున్నాయని, ఆ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మీ మీ డివిజన్లల్లో ఆక్టివ్ గా ఉండాలన్నారు. 5 రోజుల్లోనే ప్రతి డివిజన్ ప్రతి బూత్ అధ్యక్షుడి వివరాలు పంపాలని ఆదేశించారు. 35 అనుబంధ విభాగాలు ఉన్నాయని, పని చేస్తేనే పదవులను పార్టీ ఇస్తుందని అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.