ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయండి – స్పీకర్ ను కోరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు స్పీకర్ కు ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 13 వ తేదీన అసెంబ్లీలో తన పై అనుచిత వ్యాఖ్యలను చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో ఈ సమావేశాల నుండి స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే..స్పీకర్ ను కలిసిన వారిలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద తదితరులు ఉన్నారు. 

 

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page