Saturday, October 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADత్వ‌ర‌లో ప‌ఠాన్ బ‌స్తీలో సిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నులు ప్రారంభం

త్వ‌ర‌లో ప‌ఠాన్ బ‌స్తీలో సిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్‌, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) :     నియోజ‌క‌వ‌ర్గంలోని ముషీరాబాద్ డివిజ‌న్‌ పఠాన్ బస్తీలో సిసి ( CC ) రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ పనులకు ఆమోదం లభించింది. దసరా తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులను తక్షణమే చేపట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ యువ నాయ‌కుడు ముఠా జైసింహ త‌దిత‌ర నేత‌లు మంగ‌ళ‌వారం జ‌ల‌మండ‌లి సిజిఎం వినోద్ కుమార్, జిఎం శ్రీధర్ రెడ్డి, డిజిఎం విష్ణువర్ధన్‌లను కలిశారు. దసరా పండుగ కారణంగా ప్రస్తుతం కూలీలు అందుబాటులో లేరని, పండుగ ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని సిజిఎం హామీ ఇచ్చారు. అనంతరం పఠాన్ బస్తీలోని అమీర్ గరీబ్ కిరాణా స్టోర్ నుండి మార్టినెట్ హై స్కూల్ వరకు సిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ పనులకు సంబంధించిన ప‌రిస‌రాల‌ను బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జావెద్ ఖాన్ ఆధ్వ‌ర్యంలో జయసింహతో పాటు నేత‌లు మునావర్ చంద్, సయ్యద్ సర్వర్, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, దీన్‌దయాల్‌ రెడ్డి తదితర బిఆర్‌ఎస్ నాయకులు సందర్శించారు. సుమారు 2 ల‌క్ష‌ల 19 వేల రూపాయ‌ల బడ్జెట్‌తో చేపట్టనున్న ఈ పనుల వ‌ల్ల స్థానిక వాసుల‌కు, విద్యార్థులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించ‌నున్న‌ట్లు జైసింహా అన్నారు. సిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నుల‌కుగాను నిధులు మంజూరు చేయించిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page