Saturday, October 17, 2026
No menu items!
HomeEducationప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 31పై అభ్యంత‌రాలు.. యూజీసీ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌న్న టీడీఏ

ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 31పై అభ్యంత‌రాలు.. యూజీసీ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌న్న టీడీఏ

📰 Generate e-Paper Clip

తార్నాక, అక్టోబర్ 13, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ ఉన్న‌త విద్యా శాఖ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి జారీ చేసిన జీవో నెంబ‌ర్ 31లో అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. యూజీసీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌లు అంశాలు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌కు కొత్త‌గా నిబంధ‌న‌లు పెట్ట‌డం స‌రైన‌ది కాదన్న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఎంట్రీ లెవ‌ల్‌లో ఉండే పోస్టుకు అసోసియేట్ ప్రొఫెస‌ర్‌కు పెట్టే అర్హ‌త‌ల‌ను అసిస్టెంట్‌కు పెట్ట‌డం అభ్యంత‌ర‌క‌ర‌మంటున్నారు. ముఖ్యంగా అనుభ‌వ‌జ్ఞుల‌ను దూరం పెట్టేందుకు ఉన్న‌త విద్యాశాఖ అధికారులు ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. 10 ఏళ్ల క్రితం డిగ్రీ, పీజీ ప‌రీక్ష‌ల్లో యూనివ‌ర్సిటీ అధికారులు విద్యార్థుల‌కు త‌క్కువ శాతం మార్కులు వేసేవార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అదే ఇప్పుడు 10 ఏళ్ల క్రితం పీజీ, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లే ప్రమాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఎందుకంటే.. ప్ర‌భుత్వం జారీ చేసిన కొత్త జీవోలో.. డిగ్రీలో 80 శాతం పైన మార్కులు సాధించిన వారికి 15 మార్కులు కేటాయించ‌డ‌మే తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

ముఖ్యంగా సోష‌ల్ సైన్స్ విద్యార్థుల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఈ మ‌ధ్య కాలంలో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు అధిక శాతం మార్కులు రావ‌డం వ‌ల్ల.. సీనియ‌ర్ విద్యార్థుల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలంగాణ డాక్ట‌రేట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు న‌రేంద‌ర్ రెడ్డి, ఉపాధ్య‌క్షుడు డాక్ట‌ర్ తిరుప‌తి బొల్లం, స‌ల‌హాదారు డాక్ట‌ర్ ర‌మ‌ణ‌రావు, ప్ర‌తినిధులు క‌ట్కూరి, మ‌హేంద‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక డిగ్రీలో 80 నుంచి 60 శాతం వ‌చ్చిన వారికి 13 మార్కులు, 50 నుంచి 60శాతం వ‌చ్చిన వారికి 10 మార్కులు, 55 నుంచి 45 శాతం వ‌చ్చిన వారికి 5 మార్కులు కేటాయించారు. అయితే.. ఇక్క‌డ 30 ఏళ్లు పై బ‌డిన అభ్య‌ర్థుల‌కు డిగ్రీలో త‌క్కువ మార్కులు రావడ‌మే ఈ వివాదానికి కార‌ణ‌మంటున్నారు డాక్ట‌రేట్ అభ్య‌ర్థులు. ఇక మూక్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్విటేష‌న్‌, ప‌రిశోధ‌న అభ్య‌ర్థులకు కూడా జీవో 31లో ప్ర‌ధాన‌త్య ఇవ్వ‌డం వ‌ల్ల అస‌లైన ప‌రిశోధ‌న విద్యార్థుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. ప‌రిశోధ‌న అసోసియేట్‌కు మార్కులు ఇవ్వ‌డం మ‌నేది యూజీసీలో లేదని గుర్తు చేస్తున్నారు టీడీఏ ప్ర‌తినిధులు. ఈ జీవోని బ‌ట్టి చూస్తే.. 30 ఏళ్లు దాటిన వారికి ఉద్యోగాలు ఇవ్వ‌కూడ‌ద‌నే కుట్ర చేస్తుంది ప్ర‌భుత్వం. మార్కుల‌ను చూసి జాబులు ఇవ్వ‌డానికి నిబంధ‌న‌లు ఒప్పుకోవు. అదే.. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ విష‌యంలో యూజీసీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌లు నిబంధ‌న‌లుపెట్టార‌ని టీడీఏ ప్ర‌తినిధులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో ప‌ని చేసిన వారికి ప్రాధాన్య‌త ఇస్తార‌ని జ‌రుగ‌తున్న ప్ర‌చారం కూడా మంచి ప‌ద్ద‌తి కాద‌ని అంటున్నారు. ఇందులో ప్ర‌భుత్వ ఉద్యోగం ఉన్న‌వాళ్ల‌కే అనుకూలంగా ఉంటేట్టు నిబంధ‌న‌లు త‌యారు చేశార‌ని ఆరోపిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వ ఈ జీవో విష‌యంలో ప‌రిశీలించి చేర్పులు మార్పులు చేయాల‌ని అభ్య‌ర్థులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page