Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaసినీ నటి జెత్వానీ కేసు...

సినీ నటి జెత్వానీ కేసు…

📰 Generate e-Paper Clip

ముంబై నటి కాదంబరీ జెత్వానీని అరెస్ట్ చేసి, ఇబ్బందులు పెట్టిన వ్యవహారంలో ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించింది. 

ఈ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారి సస్పెన్షన్ గడువు ముగియడంతో… సస్పెన్షన్ ను సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ ముగ్గురు ఐపీఎస్ లు అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు తర్వాత సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page