Sunday, September 20, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅబిడ్స్ సర్కిల్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

అబిడ్స్ సర్కిల్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

అబిడ్స్‌, సెప్టెంబర్ 19, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ అబిడ్స్ సర్కిల్ కార్యాలయంలో శ‌నివారం ఇందిరా మహిళా శక్తి ( IMS ) క్యాంటీన్ ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజ‌రై కాగా, ఆయ‌న‌తో పాటు గోల్కొండ జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్ ( UCD ), డిప్యూటీ కమిషనర్ ( కో–ఆపరేటివ్ ), ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి సురక్షితమైన, పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన, అందుబాటు ధరలలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ చిన్నచిన్న పొదుపులు, సమష్టి కృషితో ఈ స్థాయికి చేరుకున్నామని, అబిడ్స్ వంటి ప్రధాన ప్రాంతంలో ఉన్న సర్కిల్ కార్యాలయంలో క్యాంటీన్ నిర్వహించే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో DE, SWM, EE, AE, AMCలు, వార్డు మెంబర్లు, అధికారులు, సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page