భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, ఆగ‌స్టు 28, అద్దం న్యూస్ :    భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సహాయం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధనం అయిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా అదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు రోడ్లు పూర్తిగా నాశనమైపోయి, చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేక రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగని విషాదంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజలను ఎలా ఉన్నారని పరామర్శించే నాధుడు లేక అయోమయంలో అల్లాడిపోతూ కొట్టు మిట్టాడుతున్నారన్నారు. ఇంత జ‌రుగుతున్నా విపత్తు నిర్వహణ శాఖ ఉందా లేదా అని అసలు ఏం చేస్తోందని ప్రశ్నించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే ఈ ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం మరొక వైపు. మంత్రులు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు ఎక్కడున్నారో వారి అడ్రస్ గల్లంతయిందా ..లేదా ఈ వర్షాలు కొట్టుకుపోయారా అని ఎద్దేవా చేశారు. గత నాలుగు రోజుల్లో ఎవరో స్పందించకపోవడం ఏమిటి అని దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం రివ్యూ మీటింగులని ప్రయత్నం చేస్తున్నారని ధ్వ‌జమెత్తారు. ఈ స‌మావేశంలో టిడిపి నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్‌, బాల‌రాజ్‌గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page