Friday, September 18, 2026
HomeHyderabadచైన్ స్నాచింగ్‌ల‌కు పాల్పడుతున్న దొంగ‌ అరెస్ట్ — 9 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం...

చైన్ స్నాచింగ్‌ల‌కు పాల్పడుతున్న దొంగ‌ అరెస్ట్ — 9 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం

 

దొంగలించిన బైక్ పై దర్జాగా తిరుగుతూ

చైన్ స్నాచింగ్‌ల‌కు పాల్పడుతున్న దొంగ‌ అరెస్ట్

–  9 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం

 

సికింద్రాబాద్, ఏప్రిల్ 25, అద్దం న్యూస్ :   దొంగలించిన ద్విచక్ర వాహనం పై దర్జాగా తిరుగుతూ వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వారి మెడలోని బంగారు ఆభరణాలను కాజేస్తున్న నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌ని వద్ద నుంచి ఎనిమిది లక్షల విలువ చేసే 9 తులాల బంగారాన్ని, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్‌కు తరలించారు. బేగంపేట్ పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాకు చెందిన పాపాన్ని క్రాంతికుమార్ (32) చెడు అలవాట్లకు బానిసై వరస చోరీలకు పాల్పడుతున్నాడు. చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ద్విచక్ర వాహనాన్ని దొంగలించి వాహనంపై తిరుగుతూ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళల చోరీ చేసి పరారవుతున్నాడు. మారేడుపల్లి పోలీస్‌స్టేష‌న్ పరిధిలో దుకాణం అద్దెకు కావాలంటూ వృద్ధ మహిళతో మాటల్లో పెట్టి గొలుసును అపహరించాడు. బేగంపేట్ పోలీస్‌స్టేష‌న్ పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్ళాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్‌ల‌ను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టడం జరిగిందని దాదాపు 300 సీసీ టివి పుటేజీల‌ను పరిశీలించి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడు క్రాంతి కుమార్‌ను అరెస్టు చేసి తరలించడం జరిగిందన్నారు. చోరీ చేసిన 9 తులాల బంగారంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 14 కేసులు నమోదైనట్టు విచారంలో తేలిందన్నారు. అనుమానితులు ఎవరైనా తమ ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వారి పట్ల అప్రమత్తంగా ఉండడమే కాకుండా పోలీసులకు సమాచారం అందివ్వాలని డీసీపీ రష్మీ పెరుమాళ్ ప్రజలకు సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page