హైదరాబాద్, జూన్ 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గురువారం చండీ హోమం, గోపూజ జరిగింది. ఈ పూజలకు హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదపారాయణ, మండప పునఃపూజలు, అమ్మవారి విగ్రహం ఊరేగింపు నిర్వహించారు. అలాగే మూలమంత్ర, ఆవాహిత హోమాలు, శ్రీసూక్త, దుర్గా సూక్త, రుద్ర హోమాలు, ధాన్యాధివాసం, పుష్పాది వాసం, శయ్యాది వాసాలు, నీరాజన మంత్ర పుష్పాలు, చతుర్వేద స్వస్తి తదితర పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ, ఉద్యోగస్తులు, విశ్రాంతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, గ్రంథాల సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply