టిడిపి జిల్లా కార్యాయ‌లంలో చంద్ర‌బాబు బ‌ర్త్ డే వేడుక‌లు

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు బ‌ర్త్ డే వేడుక‌లు ఆదివారం హైద‌రాబాద్ జిల్లా పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ విచ్చేసి, జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసారు. ఈ సంద‌ర్భంగా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు పి.సాయిబాబాతో క‌లిసి జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… దివంగ‌త ఎన్‌టిఆర్‌ సిద్ధాంతాలు, ఆశయాలను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ విద్య , వైద్య, రవాణా, వ్యవసాయం, సంక్షేమ, అభివృద్ధి రంగాలలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారన్నారు. పారిశ్రామికీకరణకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, దేశ విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టి లక్షలాది యువత ఉపాధికి దోహదపడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు విద్యను ఒక యజ్ఞంలా నిర్వహించారని పేర్కొన్నారు. జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ లకు ధీటుగా 3వ నగరం సైబరాబాదును సృష్టించి ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఐటీని అభివృద్ధి చేయడంలో, హైదరాబాద్ రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి ఎనలేనిదని, సాంకేతిక ఐటి రంగంలో దేశంలోనే అగ్రగామిగా హైదరాబాద్‌ను నిలిపారని అన్నారు.

                                   కేక్ క‌ట్ చేస్తున్న అర‌వింద్‌కుమార్ గౌడ్

సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు సాయిబాబా మాట్లడుతూ… రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో పార్టికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. దాని కోసం ముందుగా కార్యకర్తలందరూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇక నుండి రెట్టించిన ఉత్సాహంతో ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎం.ఏ.సిద్దీఖి, కట్టరాములు, పరుశురామ్, ఎస్.ప్రకాష్, చంద్రమోహన్, ఎబిఆర్.మోహన్, ఎం.రాజు, ప్రదీప్ గౌడ్, జి.అనిల్ కురుమ, శ్యామ్ సుందర్, కిరణ్, బానుప్రకాష్, సత్యనారాయణ, బి.రాజు, జగదీష్ గౌడ్, సుక్రవేది, రామారావు, సత్తన్న, బిక్షపతిచారి, రబ్బాని, మహేంధర్, కృష్ణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page