టివైజెఎఫ్ జహీరాబాద్ అధ్యక్షునిగా చెలిమేడ అనిల్‌కుమార్
హైదరాబాద్, మే 13, అద్దం న్యూస్ : తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) జహీరాబాద్ అధ్యక్షునిగా చెలిమేడ అనిల్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు అనిల్‌కుమార్‌ను జహీరాబాద్ అధ్యక్షునిగా నియమిస్తూ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.తనుగుల జితేందర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ టివైజెఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో అనిల్ కుమార్‌కు నియామకపత్రాన్ని అందచేశారు. ఆయనతో పాటు తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) జహీరాబాద్ ఉపాధ్యక్షుడిగా నాగేష్‌లను నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.తనుగుల జితేందర్‌రావు మాట్లాడుతూ… జర్నలిస్టు వృత్తి బాధ్యత గల వృత్తి అని, ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని అన్నారు. తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) జహీరాబాద్ పూర్తి కమిటీని అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కలిసి నియమించాలని ఆదేశించారు. తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) జహీరాబాద్ అధ్యక్షునిగా నియమితులైన చెలిమేడ అనిల్‌కుమార్ మాట్లాడుతూ… తన పై నమ్మకంతో జహీరాబాద్ అధ్యక్షునిగా నియమించినందుకుగాను రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. టివైజెఎఫ్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply