సిబిల్ స్కోర్ నిబంధ‌న‌ను తొల‌గించాలి – రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు దరఖాస్తు దారులందరికి ఇవ్వాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.క్రిష్ణ‌య్య‌

 

సిబిల్ స్కోర్ నిబంధ‌న‌ను తొల‌గించాలి

రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు దరఖాస్తు దారులందరికి ఇవ్వాలి

♦ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.క్రిష్ణ‌య్య‌

 

హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ :    సిబిల్ స్కోర్ నిబంధ‌న‌ను తొల‌గించాల‌ని, రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలు దరఖాస్తుదారులందరికి ఇవ్వాల‌ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.క్రిష్ణ‌య్య అన్నారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్ అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో సోమ‌వారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆర్‌.క్రిష్ణ‌య్య మాట్లాడుతూ… రాజీవ్ యువ వికాసం పధకం క్రింది యిచ్చే సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్క దరఖాస్తు దారునికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక షరతులు విధించి సంఖ్యను తగ్గించిడానికి చేసే ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారు. బడ్జెటు 6 వేల కోట్లు నుండి 15 వేల కోట్లుకు పెంచాలని కోరారు. ఈ పధకం చాలా ముఖ్యమైనదని… గత ఎన్నికలలో నిరుద్యోగ యువత బిఆర్ఎస్ ప్రభుత్వ అన్యాయం చేసిందన్ని ఓడించారన్నారు. నిరుద్యోగ యువత ఆశలు ఆడియశాలు చేయవ‌ద్ద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ వికాస్ యోజ‌న పథకంలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 50 వేలు, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు 4 లక్షల రుణాలను సబ్సిడీ కింద ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల 25 వేల 441 దరఖాస్తులు యువత నుంచి వచ్చాయని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్లను, ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతకు కేటాయిస్తున్నామని స్వయంగా ఆర్ధిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారన్నారు. అయితే ఈ పథకంలో ఉపాధి పథకాలకు గందరగోళం పరిస్థితి ఏర్పాటు అయినట్టు ఫిర్యాదులు అందుతున్నాయని, జిల్లా, మండల స్థాయిలో వెరిఫికేషన్ల పేరిట నిరుద్యోగ యువతను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఒకటి రెండు సార్లు కాకుండా మళ్లీమళ్లీ వెరిఫికేషన్ పేరిట యువతను మండల జిల్లా కార్యాలయాలకు రమ్మని అధికారులు ఫోన్లు చేస్తూ నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలే ఈ పథకానికి అర్హులను సిబిల్ స్కోర్ అనే కొత్త షరతును విధించడం ద్వారా 40 శాతం కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారన్నారు. బీసీలకు చెందిన 5,35,666 దరఖాస్తులలో సగం దరఖాస్తులు తిరస్కరించినట్టుగా తెలుస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఒక పక్క అవకాశం ఇస్తామని చెబుతూ మరోపక్క లేనిపోని షరతులను విధించి వారి ఉపాది అవకాశాలకు గండి కొట్టాలని చూస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఇచ్చేందుకు అంతగా శ్రద్ధ చూపడం లేదు అనే ఫిర్యాదులు కూడా బ్యాంకులలో మొదటగా జమ చేయాలని ఆ తర్వాతనే మిగతా సొమ్మును నిరుద్యోగ యువతకు ఇవ్వడానికే బ్యాంకులు ముందుకు వస్తున్నాయ‌న్నారు. ఇవి కాకుండా యువతకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిబిల్ స్కోరే ప్రధానమని చెబుతుందని తెలిపారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని.. గ్రామీణ ప్రాంతాలలో యువతకు సిబిల్ మీద అంతగా అవగాహన లేదన్నారు. ఇప్పటివరకు అసలు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం పొందని యువతకు సీబీలు ఎక్కడి నుంచి వస్తుందని యువత ఆవేదనకు గురవుతున్నారని.. కావున ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఎటువంటి పైరవీలకు తావు లేకుండా నిజమైన యువతకు ఉపాధి కల్పించాలని, పైరవిలకు తావు లేకుండా యువతకు రుణాలను అంది ఇవ్వాలని ఆర్.క్రిష్ణ‌య్య‌ కోరారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌

                       స‌మావేశంలో మాట్లాడుతున్న బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్‌

బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ నీల వెంక‌టేష్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు రుణాలు మంజూరు చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయాన్నారు. సెలక్షన్ ప్రాసెస్ లో బ్యాంకుల జోక్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెటు 6వేల కోట్ల నుంచి 15వేల కోట్లకు నిధులు కేటాయించి అందరికీ రుణాలను ఇవ్వాల‌ని, ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కాబట్టి షరతులు లేకుండా యువతకు రుణాలు ఇవ్వాలన్నారు. ఈ స‌మావేశంలో బిసి సంక్షేమ సంఘం నాయ‌కులు మ‌ణికంఠ‌, అనంత‌య్య‌, రాజు నేత‌, గొరిగె మ‌ల్లేష్‌, ఆశీష్ గౌడ్, అంజి, ప‌గిళ్ల స‌తీష్‌, రాజేంద‌ర్‌, బాల‌య్య‌, కౌశిక్‌, మ‌ధుసూద‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page