CM Revanth : పాత‌బ‌స్తీ మెట్రో రైల్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి

పాత‌బ‌స్తీ మెట్రో రైల్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయండి
– అధికారుల‌ను ఆదేశించిన‌ సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, ఆగ‌స్టు 11, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ( HMRL )పై ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలిచ్చారు.ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్‌లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లను జత చేయాలని చెప్పారు. ఇందుకు అవసరమైన కోచ్‌ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్‌కు సంబంధించి ప్రస్తుత సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి, అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page