పామాపురంలో శ్రీరామ నవమి వేడుకలో వెల్లివిరిసిన మత సామరస్యం – ముస్లిం సోదరులను సత్కరించిన వారణాసి సుధాకర్

పామాపురంలో శ్రీరామ నవమి వేడుకలో వెల్లివిరిసిన మత సామరస్యం
» ముస్లిం సోదరులను సత్కరించిన వారణాసి సుధాకర్

వనపర్తి, అద్దం న్యూస్ :   వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకలో మత సామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని భక్తాంజనేయ దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగిన సీతమ్మ– రామయ్య తలంబ్రాల కార్యక్రమం ఇందుకు వేదికైంది. గ్రామానికి చెందిన మండల మైనారిటీ కో– ఆప్షన్ మాజీ సభ్యులు అల్లబాష, డాక్టర్ అల్లిపిర్ తదితరులు నవమి వేడుకలో ఉత్సాహంగా పాల్గొని మత సామరస్యాన్ని చాటి చెప్పారు. ఇటు శ్రీరామ నవమి అయినా అటు వినాయక చవితి అయినా ఇలా ఏ పండుగ వచ్చినా అల్లభాష భక్తితో పాల్గొంటూ తనవంతుగా సేవలు అందిస్తున్నారు. శ్రీరామ నవమి రోజున అల్లభాష భక్తుల నుంచి చదివింపులను రాబట్టడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించడం ప్రత్యేకత. ప్రభ కార్యక్రమంలోనూ పాల్గొనడమే కాక కల్యాణ వేడుకలో ముగిసేంత వరకు దగ్గరుండి భక్తులకు సేవలు అందిస్తున్నందుకు గానూ అల్లభాషను ప్రత్యేకంగా సత్కరించారు.

గ్రామ యువకుడు వారణాసి సుధాకర్ వారితో పాటు కొందరు గ్రామస్తులు అల్లభాష సేవలను, డాక్టర్ అల్లిపిర్ మత సామరస్యాని గుర్తు చేస్తూ వారి ఇరువురికి శాలువా, ప్రత్యేక బహుమతి అందజేసి అభినందనలు తెలియజేశారు. తమ గ్రామంలో కుల, మత వైషమ్యాలు లేకుండా వండుగలను నిర్వహించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని సుధాకర్ పేర్కొన్నారు. మత సామరస్యం, సౌభ్రాతృత్వం పలు వేడుకలలో ప్రతిబింబిస్తుందని, ఇలాగే అందరూ కలిసి మెలసి సమైక్యంగా పండుగలు జరుపుకోవడం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. గ్రామ పెద్దలు, యువకులు సంఘటితంగా గ్రామ అభివృద్ధికై కృషి చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అల్లభాష స్పందిస్తూ, ఒకరి మతాన్ని మరొకరు పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. కుల, మత వైషమ్యాలు లేకుండా పండుగలను నిర్వహించుకోవడంలో కలిగే సంతోషం మరొకటి ఉండదన్నారు. ఈ సత్కార కార్యక్రమంలో సర్పంచి భర్త గొల్ల రామచందరయ్య, ఉప సర్పంచి శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి బస్సా ఉమా మహేశ్వర్ రెడ్డి, అయ్యపు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page