హైదరాబాద్, మే 21, అద్దం న్యూస్ : డివిజన్‌లో అభివృద్ధి, పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. బుధవారం ఆమె జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్‌తో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ అభివృద్ధి పై చర్చించారు. అలాగే పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ పావని కోరారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జోనల్ కమిషనర్‌కు కార్పొరేటర్ పావని అందచేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ గాంధీనగర్ డివిజన్ అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారని కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ భేటీలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply