గ‌డువులోపు టిడిపి క‌మిటీల‌ను పూర్తి చేయండి  – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

గ‌డువులోపు టిడిపి క‌మిటీల‌ను పూర్తి చేయండి 

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ :   గ‌డువులోపు టిడిపి క‌మిటీల‌ను పూర్తి చేయాల‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని డివిజన్ కమిటీల‌ ఏర్పాటు గురించి నియోజకవర్గ పరిశీలకులతో పార్లమెంటు కన్వీనర్ పి.సాయిబాబా సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధ‌వారం న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మీక్షా స‌మావేశంలో ఒక్కో నియోజకవర్గం వారీగా డివిజన్ కమిటీ ఎన్నికల గురించి పరిశీలకులతో సాయిబాబా చర్చించారు. దాదాపుగా డివిజన్ కమిటీలు పూర్తయ్యాయని పరిశీలకులు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని 6 డివిజ‌న్ల‌కుగాను 5 డివిజ‌న్ల క‌మిటీలు పూర్తయ్యాయని పరిశీలకులు పరుశురామ్, వీరబాబు తెలిపారు. అంబ‌ర్‌పేట‌లోని 5 డివిజ‌న్ల‌కుగాను 2 డివిజ‌న్ల క‌మిటీలు పూర్త‌య్యాయ‌ని పరిశీలకులు పి.బాలరాజ్ గౌడ్, లాయఖ్ లు తెలిపారు. అలాగే ఖైరతాబాద్‌లోని 5 డివిజన్ల‌కుగాను 4 డివిజ‌న్ క‌మిటీలు పూర్తయ్యాయని పరిశీలకులు రాజేంధ్రప్రసాద్ మల్లిఖార్జున్ వివ‌రించారు. జూబ్లీహిల్స్‌లోని 7 డివిజ‌న్ల‌కుగాను 3 పూర్తయ్యాయని పరిశీలకులు ఎంకె.బోసు, సి.విఠ్ఠల్ లు పేర్కొన్నారు. స‌న‌త్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని 5 డివిజ‌న్ల‌కుగాను 2 డివిజ‌న్లు పూర్తి అయ్యాయ‌ని ప‌రిశీల‌కులు నల్లెల్ల కిషోర్, శ్యామ్ సుందర్ తెలిపారు. నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని 6 డివిజ‌న‌న్ల‌కుగాను 6 డివిజ‌న్లు పూర్తి అయ్యాయ‌ని పరిశీలకులు ఎం.రాజు, భాను ప్రకాష్ లు సాయిబాబ‌కు తెలియ‌చేశారు. సికింద్రాబాద్‌లోని 5 డివిజ‌న్ల‌కుగాను 2 డివిజ‌న్ క‌మిటీలు పూర్తి అయ్యాయ‌ని పరిశీలకులు జాకబ్, ఎబిఆర్ మోహన్ లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… పూర్తయి వాటిని వెంటనే పార్టీ కార్యాలయానికి నివేదికను సమర్పించాలని పరిశీలకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు జి.అనిల్ కురుమ, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page