Friday, September 18, 2026
HomeAPకులగణన పేరుతో సర్వే నిర్వహించి బీసీల సంఖ్య కుదించి తక్కువగా చూపించే కుట్ర చేస్తున్న కాంగ్రెస్...

కులగణన పేరుతో సర్వే నిర్వహించి బీసీల సంఖ్య కుదించి తక్కువగా చూపించే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు సాయిబాబా

కులగణన పేరుతో సర్వే నిర్వహించి బీసీల సంఖ్య కుదించి తక్కువగా చూపించే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు సాయిబాబా


హైదరాబాద్, అక్టోబ‌ర్ 23, అద్దం న్యూస్ :   “ఏరు దాటాక తెప్ప తగలేసిన” చందంగా కులగణన పేరుతో చిత్తశుద్ధి లేని సర్వే ఒకటి నిర్వహించి, బీసీల సంఖ్య కుదించి తక్కువగా చూపించే కుట్రను కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసింద‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌లగూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… సామాజిక తెలంగాణ తెస్తామనే పేరుతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు పూర్తిస్థాయి న్యాయం కల్పిస్తామని గత శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పిలిపించి కామారెడ్డిలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ప్రచార ఆర్భాటంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిప‌డ్డారు. తన మంత్రివర్గంతో ఆమోదం చేసుకొని ఆకాగితాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏదో సాధించామని, ఆ తర్వాత బిసి రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే ఏమీ చేయలేని అసహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. అంతే కాకుండా ఇటీవల ఆ మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన పనుల టెండర్ విషయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పనులు జరుగుతుంటే… కమిషన్లు తనకు రాలేదంటూ ఓ బీసి మహిళా మంత్రి అని చూడకుండా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం, ముఖ్యమంత్రి ఆమెపై చర్యలకు ఉపక్రమించడం అనేది విడ్డూరంగా ఉందన్నారు. ఆ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ మంత్రి పట్ల ఉన్న చిత్తశుద్దిని తెలియజేస్తుందన్నారు. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న బీసీలకు న్యాయం చేస్తామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కలబొల్లి మాటలతో ఇప్పటి వరకు ప్రజల్ని మభ్య పెట్టారు. మొన్నటి యూరియా కొరత సమస్యను కేంద్ర ప్రభుత్వం పైకి నెట్టి వేశారన్నారు. ఆ పబ్బం గడగగానే, మరోక వైపు మీమంత్రివర్గ మంత్రులే మీకు వ్యతిరేకంగా ( రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి ) లు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నార‌ని, ప్రజల కోసం ఏమి చేయట్లేదంటూ ప్రకటించడం, నిరుద్యోగ సమస్య పట్టించుకోవడంలేదని మాట్లాడడం.. ఏ విధమైన సమస్యలను పట్టించుకోవడంలేదని నిలదీస్తే, సమాధానం చెప్పుకోలేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీతో అయ్యే పని కాదని సాయిబాబా అన్నారు. కేవలం ఇది స్థానిక సంస్థల్లో లబ్ది పొందడానికి కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడగా ఆయన అన్నారు. అటు ఇటు కాకుండా ఎటుగా రిజర్వేషన్ల విషయంలో మా వంతు ప్రయత్నం మేము చేశామంటూ చేతులు దులుపుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలేసారని ధ్వ‌జ‌మెత్తారు. మొదటి నుంచి కాంగ్రెస్ తీరు ఇదేనని విమ‌ర్శించారు. కనీసం ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గ్రహించి అణగారిన బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్‌కు ఏనాడు చిత్తశుద్ధి లేదని… అందుకు కొండా సురేఖ ఉదంత‌మే ఉదాహరణగా అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బీసీ నాయకులు, కాంగ్రెస్ గ్రహించి బలహీన వర్గాల సోదరులందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page