బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఆధిపత్య పాలక వర్గం కుట్రలు
– ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
హైదరాబాద్, అక్టోబర్ 8, అద్దం న్యూస్ : బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఆధిపత్య పాలక వర్గం కుట్రలు చేస్తుందని ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. పెరుగుతున్న ఆర్ధిక అసమానతలపై ఎంసిపిఐ ( యు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన చేపడుతామన్నారు. దేశంలో ఆర్థిక సామాజిక ఆర్థిక అసమానతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయన్నారు. బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఓంకార్ భవన్‌లో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( ఐక్య ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు న్నం వెంకన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎంసిపిఐ ( యు ) నాయకులు, కార్యకర్తలు నర్రా విద్యుల్లత పొనుగోటి చంద్రమౌళి, నాలికె అనిల్, యుద్ధాలలో మరణించిన వారికి, ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారికి సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంసిపిఐ ( యు ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ… రాజ్యాంగ విధ్వంసంలో భాగమే సుప్రీంకోర్టు సిజేఐ గవాయ్ పై దాడి దారుణమన్నారు. మతం ఆచారం వ్యక్తిగతం- ఉన్మాదం సమాజానికి పెను ముప్పు అని అన్నారు. కార్పొరేట్ వర్గాల సేవలో కేంద్ర బిజెపి పాలన… కాంట్రాక్టు- కమీషన్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నాయని విమర్శించారు. జీతాలపైననే జీవించే కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు నెలల తరబడి జీతాలు ప్రభుత్వం ఇవ్వడంలేదన్నారు. ఆరు గ్యారంటీలను అటకెక్కించిన దివాళా ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు. కార్పొరేట్ పాలక పార్టీలు- మతోన్మాద దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రత్యామ్నాయం ద్వారా స్తానిక ఎన్నికల్లో ఎంసిపిఐ ( యు ) పోటీ చేస్తుందన్నారు. సకల బహుజన శ్రామిక వర్గాల ఐక్య ప్రత్యామ్నాయం కోసం అన్ని సామాజిక, రాజకీయ శక్తులు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తో కలిసి రావాలి అని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి, కాకులను కొట్టి గద్దలకి వేసినట్లుగా బడా కార్పొరేట్, కాంట్రాక్టర్లకు ఊడిగం చేస్తుందన్నారు. ప్రజల మౌలిక సమస్యలు విద్య, వైద్యం, గృహ వసతి, ఉద్యోగం, ఉపాధి, రవాణా, రోడ్లు, రక్షణ, పరిశ్రమలు, వ్యవసాయ రంగం, వైజ్ఞానిక అభివృద్ధికి ఏ మాత్రం కేంద్రీకరణ చేయకుండా మతోన్మాదం రెచ్చగొట్టే భారత దేశానికి ప్రపంచంలో ఉన్న ప్రతిష్టను మసక సారిస్తున్నారని అన్నారు.
ఇది ప్రశ్నించిన ప్రతి వారిపై భౌతిక దాడులు చేస్తూ, నిర్బంధ చట్టాలను అమలు చేస్తూ జైల్లో పెడుతూ ఉన్న పరిస్తితి సుప్రీంకోర్టు సిజేఎ గవాయ్ పై సుప్రీంకోర్టులో దాడి చేయడం దేశం ఎటు వైపు వెలుగుతుందని, ఏమైపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ప్రజాస్వామ్యం అడుగంటి పోయిందని, ప్రజా సమస్యలపై నిరసన చేయకుండా ముందస్తు అరెస్టులు, అరాచకం బాగా పెరుగుతుందని తెలిపారు. సమస్యలపై సతమతం అవుతున్న ప్రజలపై పన్నుల భారం, చార్జీల భారం వేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు ఆర్‌టిసి చార్జీలు బారిగా పెంచటం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమా, కాంట్రాక్టు కమీషన్ల ప్రభుత్వమా ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో జరుగుతున్నస్థానిక ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చిన మతోన్మాద కార్పొరేట్ దోపిడీ పాలకవర్గం – పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణలో మేధావులు, బహుజనులు, సకల వర్గాలు అన్ని కలిసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ( బిఎల్ఎఫ్ ) ను ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. అందులో భాగంగానే కలిసి వచ్చే సామాజిక బహుజన, వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో బిఎల్ఎఫ్, ఎంసిపిఐ ( యు ) కలిసి పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపెందర్ రెడ్డి, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, సుకన్య, మట్టయ్య, హంసా రెడ్డి, మంద రవి , రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్, వస్కుల సైదక్క, గడ్డం నాగార్జున, మాలోతు జబ్బార్ నాయక్, వంగల రాగసుద, సంద్య, మాస్ సావిత్రి, శ్రీనివాస్, అనిల్ కుమార్, తాండ్ర కళావతి, కంచ వెంకన్న, నాగెల్లి కొమురయ్య, కాశీ, కర్ర రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply