మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డికి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
తార్నాక, ఆగస్టు 26, ( అద్దం న్యూస్ ) : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తార్నాక బ్రహ్మకుమారీలు ప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ని తార్నాక లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మాట్లాడుతూ… రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… రాఖీ పౌర్ణమి కేవలం అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి మాత్రమే కాకుండా, సమాజంలో పరస్పర ప్రేమ, రక్షణ, ఆత్మీయత, సోదరభావాన్ని చాటిచెప్పే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్యాత్మికత, శాంతి, మానవతా విలువల ప్రచారానికి చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ప్రస్తుత సమాజంలో ప్రేమ, కరుణ, సహనం, సోదరభావం వంటి విలువలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల గౌరవం, బాధ్యతతో వ్యవహరిస్తూ శాంతియుతమైన, సామరస్యపూర్వకమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ తార్నాక ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.













Leave a Reply