హైదరాబాద్, ఆగస్టు 23, అద్దం న్యూస్ : వినాయక చవితి తర్వాత అరుంధతినగర్ బస్తీలో అభివృద్ధి పనులు కొనసాగించాలని కోరిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అధికారులకు సూచించారు. శనివారం అరుంధతినగర్ బస్తీలో వాటర్ వర్క్స్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ పావని సివరేజి పైప్‌లైన్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రస్తుతం త్రవ్వకాలు జరిపిన బస్తీ రోడ్లను పండుగ నిమిత్తం తాత్కాలికంగా మరమత్తులు జరిపి బస్తీ ప్రజలకు సహారించాలని కార్పొరేటర్ పావని కోరారు. సానుకూలంగా స్పందించినా అధికారులు కార్పొరేటర్ పావని సూచనల మేరకు పనులు సాగుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, వాటర్ వర్క్స్ డిజిఎం కార్తీక్ రెడ్డి, ఇంజినీరింగ్ శాఖ ఎఇ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, సిబ్బంది శంకర్, జగన్, బీజేపీ డివిజన్ అద్యక్షుడు వి.నవీన్ కుమార్, నేతలు ఆనంద్ రావు, సాయి కుమార్, బస్తీ అధ్యక్షుడు శ్రీనివాస్, సతీష్, పవన్, విశాల్, రాజు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply