పూడిక‌తీత‌ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

 

ముషీరాబాద్‌, అద్దం న్యూస్ :   అకాల వర్షాల వల్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్న ఫిర్యాదు మేరకు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వరదనీటి సమస్య వివరాలపై మంగ‌ళ‌వారం స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా డివిజ‌న్‌లోని అన్ని ప్రాంతాల్లో కచ్చా మోరి పైప్‌లైన్ల‌ల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త చెదారాన్ని తొలగించేందుకు సూచించారు. ఈ నేప‌ధ్యంలో డివిజ‌న్‌లోని మోర్ సూపర్ మార్కెట్ వీధిలో, కెనరా బ్యాంక్ పార్క్ మెయిన్ రోడ్డు త‌దిత‌ర ప్రాంతాల్లో జిహెచ్ఎంసి సిబ్బంది పూడిక‌తీత ప‌నుల‌ను చేప‌ట్టారు. ఈ ప‌నుల‌ను స్థానిక‌ కార్పొరేటర్ పావ‌ని ద‌గ్గ‌రుంది ప‌ర్య‌వేక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అద్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, ఆనంద్ రావు, సాయి కుమార్, డి.కుమార్, నీరజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page