హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ నాలాలో కొనసాగుతున్న పూడికతీత పనులను జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, సిబ్బందితో కలిసి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా ద్వారా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరకుండా నాలాలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టిని తొలగించే పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముంపు బస్తీల్లో వరద ప్రవాహం రాకుండా చూడాలని, అందుకు పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని జిహెచ్ఎంసి సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, నర్సింగ్ రావు, ఆనంద్ రావు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply