ప్రైవేట్ పాఠశాలలు పిల్లలకు 25 శాతం సీట్లను రిజర్వ్ చేయవలసిందే
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ బడ్జెట్‌లో విద్యపై కేటాయింపులు రెండింతలు పెంచాలి
కేజీ నుంచి పిజి వరకు ఉచిత విద్య అందించాలి
– ఆమ్ ఆద్మీ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్, జులై 4, అద్దం న్యూస్ : సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన విద్యా హక్కు చట్టం ప్రతి బిడ్డకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిందని, ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఏం.వి ఫౌండేషన్ కార్యదర్శి ఆర్.వెంకట్ రెడ్డి డిమాండ్ చేసారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో శుక్రవారం “ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీలపై ఆమ్ ఆద్మీ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆప్ రాష్ట్ర నాయకుడు బుర్ర రాము గౌడ్ అధ్యక్షత వహించగా అఖిల పక్ష నాయకులు, వివిధ సంఘాల నుండి మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ విద్యాహక్కు చట్టబద్ధంగా హామీ ఇవ్వబడిందని, విద్యా హక్కును రక్షించడం, గౌరవించడం, నెరవేర్చడం రాష్ట్రాల బాధ్యత అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై 10 నుండి 15 శతం బడ్జెట్ కేటాయిస్తే, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేయబడుతుందని తెలిపారు. విద్య హక్కు చట్టంలో భాగంగా కేజీ తో పిజి వరకు ఉచిత విద్య అందించాలని కోరారు. టీచర్స్ ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడుతూ… ప్రభుత్వాలు బాల కార్మిక వ్యవస్థ నిర్ములించి, పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచాలని, దేశంలోని 6 నుంచి 14 ఏళ్ల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాలనీ కోరారు. తల్లితండ్రుల సంఘం అధ్యక్షురాలు జి.భాగ్యమ్మ మాట్లాడుతూ… రాష్ట్రంలోని సుమారు 5 వేల ప్రభుత్వ పాఠశాలలలో మొదటి తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఒకటే టీచర్ పాఠాలు చెప్పడం, విద్య వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో తెలుస్తుందన్నారు. ఇప్పటికి మురికి వాడల్లో నివశించే పిల్లలు చదువుకు దూరంగా నెట్టివేయబడ్డారని, విద్య వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి, బడ్జెట్‌లో నిధులు పెంచి పాఠశాలలలో మౌలిక సదుపాయాలు, నిపుణులైన టీచర్లు పెంచితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేయబడుతుందని అన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్ మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. విద్య సమస్యలపై పోరాడితేనేగాని ప్రభుత్వాలు స్పందించవని, పోరాటాలు తీవ్రతరం చేయవలసిన అవసరముందన్నారు.
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ… సామాన్యుడికి విద్య అందని ద్రాక్షగా మారిందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ ప్రకారం దేశంలోని 6 నుంచి 14 ఏళ్ల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రైవేట్ విద్య సంస్థల దోపిడీని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, వారి పై క్రిమినల్ చేయాలి చేపట్టాలని అయన కోరారు. బుర్ర రాము గౌడ్ మాట్లాడుతూ… ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోయిందని, ఎంతో కష్టపడి సంపాదించినదంతా పిల్లల చదువునకే ఖర్చు అవుతుండడంతో పేద, మధ్య తరగతి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని తెలిపారు. విద్యా హక్కు చట్టం అమలు చేయడంతోపాటు నాణ్యమైన విద్యను అందించాలని విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో చైల్డ్ రైట్స్ ఫోరమ్ ప్రతినిధి డి. ప్రకాష్, మదర్ లవ్ సంస్థ ప్రతినిధి డా.ఏ. శ్రీనివాస్, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి కె.వెంకట్ సాయినాధ్, అక్షర ఫౌండేషన్ ప్రతినిధి ఆంజనేయులు, ఆప్ నేతలు డా.సోలొమన్ రాజ్, సుధారాణి, నర్సింగ్ యమునా గౌడ్, డా.లక్ష్య నాయుడు, జావీద్ షరీఫ్, జిల్లోజు హేమ, దర్శనం రమేష్, సోహైల్, షాబాజ్, అజీజ్ బేగ్, రాకేష్ రెడ్డి, రాకేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply