Friday, September 18, 2026
Homepoliticsకేసీఆర్‌పై అసభ్య ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి – ఎమ్మెల్సి...

కేసీఆర్‌పై అసభ్య ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి – ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్‌

కేసీఆర్‌పై అసభ్య ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

బండి సంజ‌య్ పై బంజారాహిల్స్ పిఎస్‌లో ఫిర్యాదు

– ఎమ్మెల్సి దాసోజు శ్ర‌వ‌ణ్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : మాజీ సీఎం, ఉద్య‌మ ర‌థ‌సార‌ధి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు పై అసభ్య ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు. బండి సంజ‌య్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో దాసోజు శ్ర‌వ‌ణ్ ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా శ్ర‌వ‌ణ్ మీడియాతో మాట్లాడుతూ… “బండి సంజయ్ – పిచ్చి మంత్రి, మెరిట్ కాదు, రేవంత్ రెడ్డి యొక్క రహస్య ఏజెంట్” అని ఆరోపించారు. కేసీఆర్ పై నిరాధారమైన ఆరోపణలు చేయ‌డం జాతీయ అవమానమ‌న్నారు. నకిలీ కరెన్సీ ఆరోపణలో కేంద్ర మంత్రివర్గం నుండి బండి సంజయ్‌ను తొలగించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. “తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పై నీచమైన, నిరాధారమైన, పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన అజ్ఞానం, అహంకారం, బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టారన్నారు. బీదర్‌లో కేసీఆర్ కుటుంబం నకిలీ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌ను నిర్వహిస్తున్నారనే బండి సంజ‌య్ చేసిన‌ అసంబద్ధమైన వాదన అని అన్నారు.

బండి సంజయ్ హోం వ్యవహారాల సహాయ మంత్రిలా ప్రవర్తించడం లేదని.. అతను వీధిల్లో పుకార్లు వ్యాపింపజేసే స్థాయికి దిగజారిపోయాడని ధ్వ‌జ‌మెత్తారు. ఇది కేంద్ర మంత్రికి పూర్తిగా తగనిదని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విఫలమైన పాలన అన్నారు. బండి సంజయ్ తన ఆరోపణలను ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించాలని.. లేదా కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంచలనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తూ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్‌పై పోలీసులు తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పిచ్చి ఆరోపణలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు బండి సంజయ్‌కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చ‌రించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page