అంబర్‌పేట్ ఎస్‌టిపిని సందర్శించిన సిఎస్
♦ తుది దశకు మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలు
♦ ఎస్‌టిపిల నుంచి దుర్వాసన కట్టడికి సాంకేతికత వినియోగం
♦ జూన్ నాటికీ పూర్తి చెయ్యడానికి కసరత్తు
♦ జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడి
♦ పాల్గొన్న జీహెచ్ ఏంసి, హెచ్ఎండిఏ కమీషనర్లు
హైదరాబాద్, మే 4, అద్దం న్యూస్ : ఎస్‌టిపిల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజ్-1లో భాగంగా హైదరాబాద్ అంబర్‌పేట్‌లో నిర్మిస్తున్న 212.5 ఎమ్మెల్డీ సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ ( ఎస్‌టిపి ) నిర్మాణ పనులను రాష్ట ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు సందర్శించారు. ఇటీవల భాద్యతలు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నగరంలో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పధకాలతో పాటు జలమండలి నిర్మిస్తున్న ఎస్‌టిపి పనుల పురోగతిని పరిశీలించారు. మొదటగా పిటియూ ( ప్రైమరీ ట్రీట్‌మెంట్ యూనిట్ ) ను సందర్శించిన రాష్ట ప్రధాన కార్యదర్శి, ఐఎన్‌డీ, స్పిల్టర్ బాక్స్, కనెక్టింగ్ చానెల్స్ ఎస్బిఆర్ బేసిన్స్, సిసిటి తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దానికి జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి మురుగు శుద్ధి ప్రక్రియ, వివిధ దశలు వివరిస్తూ జూన్‌లో ఎస్‌టిపి పనులను వేగంగా పూర్తి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఈ ఎస్‌టిపి ప్రాజెక్టు పూర్తి చేస్తే దేశంలో 98 శాతం సీవరేజి ట్రీట్‌మెంట్ చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలవనుందని తెలియజేసారు. జీహెచ్ఎంసీలోనే కాకుండా ఓఆర్ఆర్ పరిధిలో అమృత్ 2.0 ప్రాజెక్టు భాగంగా మరో 39 ఎస్‌టిపిలను నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికల సిద్ధం చేశామని.. ప్రస్తుతం టెండర్ దశలో ఉందని ఈ సందర్బంగా అశోక్‌రెడ్డి సీఎస్ కు వివరించారు. ఎస్‌టిపిల్లో వెలువడే దుర్వాసన వాళ్ళ ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలి సూచించారు. నివాసాల సమీపంలో ఉన్న ఎస్టీపీల చుట్టూ నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏస్టీపీ నుంచి దుర్వాసన రాకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అశోక్‌రెడ్డి చెప్పారు. దీనికోసం విదేశీ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇప్పటికే వినియోగంలో ఉన్న 339 ఎంఎల్డీల పాత ఎస్‌టిపి అవుట్ లెట్ వద్ద శుద్ధి చేసిన నీటిని పరిశీలించిన సీఎస్.. వాటర్ క్వాలిటీ చూసి సంతృప్తి చెందారు. ఎస్‌టిపిల్లో మురుగు శుద్ధిలోని ప్రతి దశ జలమండలి ప్రధాన కార్యాలయానికి సానుసంధానం అనుసంధానం కావడంతో.. వాటిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్‌లో పర్యవేక్షిస్తామని… పిసిబి సైతం ఆన్లైన్లో వివరాలు అందుబాటులో ఉంటాయని ఈ సందర్బంగా సీఎస్ రామ కృష్ణ రావు కు అధికారులు చెప్పారు.
ఎస్‌టిపి ప్రాజెక్టు వివరాలు :

ఎస్‌టిపిని పరిశీలిస్తున్న సిఎస్ రామకృష్ణరావు, జలమండలి ఎండి అశోక్‌రెడ్డి
హైదరాబాద్ మహానగరంలో మురుగు నీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 మిలియన్ గ్యాలన్లు ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే 25 ఎస్‌టిపిల ద్వారా 772 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. ఇక మిగిలిన 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 31 నూతన మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ( ఎస్‌టిపి )ల నిర్మాణాలు చేపట్టింది. వీటిని నిర్మించే బాధ్యతను జలమండలిపై పెట్టింది. రూ.3,866.21 కోట్ల వ్యయంతో 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ద్వారా 100 శాతం మురుగును శుద్ధి చేయడమే కాకుండా.. పరివాహక ప్రాంతాల్లో మురుగు ప్రవాహాన్ని నిరోధించడం, శుద్ధి చేసిన నీటిని మానవేతర అవసరాలకు వినియోగించవచ్చు. అంతేకాకుండా భూగర్భ జలాలు కలుషితం కాకుండా.. పర్యావరణం, ప్రజారోగ్యం పై ఎలాంటి దుష్పలితాలు ఉండవు. ఇవి పూర్తయి అందుబాటులోకి వస్తే.. రోజూ ఉత్పత్తయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ ఖ్యాతికెక్కుతుంది. ఈ 31 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే.. నగరంలో మురుగు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వీటి ద్వారా రోజూ 1259.50 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్‌టిపిల నిర్మాణం జరుగుతోంది.
జలమండలి ఎస్‌టిపి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న వాటిల్లో.. ఇప్పటికే 11 ఎస్‌టిపిలు (దుర్గం చెరువు -7 ఎమ్మెల్ది , కోకాపేట-15 ఎమ్మెల్ది, మిరాలం-1-41.5 ఎమ్మెల్ది, పెద్ద చెరువు-17.5 ఎమ్మెల్ది, నల్లచెరువు- 86.5 ఎమ్మెల్ది, నాగోల్- 320 ఎమ్మెల్ది, మియాపూర్-పటేల్‌చెరువు-7 ఎమ్మెల్ది, సఫిల్‌గూడ-5.5 ఎమ్మెల్ది, ఖాజాకుంట-20ఎమ్మెల్ది, ఫతేనగర్-133ఎమ్మెల్ది, వెన్నెలగడ్డ-10 ఎమ్మెల్ది) ప్రారంభమయ్యాయి. మరో 6 ఎస్‌టిపిలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో శివాలయనగర్-14 ఎమ్మెల్ది, నల్లగండ్ల-7 ఎమ్మెల్ది, ముల్లకతువ చెరువు-25 ఎమ్మెల్ది, అత్తాపూర్-1-64 ఎమ్మెల్ది, అంబర్‌పేట్-212.50 ఎమ్మెల్ది, పాలపిట్ట పార్క్-7 ఎమ్మెల్ది ఎస్‌టిపిలున్నాయి. మిగిలిన 3 ఎస్‌టిపిలను రైన్బో విస్టా- 43.5 ఎమ్మెల్ది, రామచెరువు -30ఎమ్మెల్ది, అత్తాపూర్పూర్-2 40ఎమ్మెల్ది ఎస్‌టిపిలను జూన్ 2025 నాటికి నిర్మాణం పూర్తి చేస్తారు.
సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ :

ఎస్‌టిపిని పరిశీలిస్తున్న సిఎస్ రామకృష్ణరావు, జలమండలి ఎండి అశోక్‌రెడ్డి
అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్‌టిపిల నిర్మాణం జరుగుతోంది. మెట్రో నగరాల్లో స్థలాభావం ఉంటుంది కాబట్టి ఎస్బీఆర్ టెక్నాలజీతో నిర్మాణం అనువుగా ఉంటుంది. వీటి వల్ల ఒకే ఛాంబర్లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి చేయవచ్చు. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్ మెంట్ పద్ధతుల కంటే ఈ ఎస్బీఆర్ విధానానికి తక్కువ ఖర్చు అవడమే కాకుండా.. మురుగునీటి శుద్ధి మెరుగ్గా జరుగుతుంది. ఇది తేలికైన విధానం. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడి మయాంక్ మిట్టల్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జిహెచ్ఎంసి కమీషనర్ కర్ణన్ లతో పాటు జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు ప్రభు, వినోద్ భార్గవ, సుజాత, జీఎంలు సుబ్రహ్మణ్యం, శ్యాం సుందర్ నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply