Sunday, October 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADఘనంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ వేడుకలు – ముఖ్య అతిధిగా హాజరైన డిఆర్‌డిఎల్‌ డైరెక్టర్ అంకతి రాజు

ఘనంగా సీఎస్ఐఆర్ ఫౌండేషన్ వేడుకలు – ముఖ్య అతిధిగా హాజరైన డిఆర్‌డిఎల్‌ డైరెక్టర్ అంకతి రాజు

📰 Generate e-Paper Clip

తార్నాక, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :    సీఎస్ఐఆర్ 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తార్నాకలోని సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ( ఐఐసీటీ ) ఆడిటోరియంలో సోమవారం ఘనంగా జరిగాయి. ‘ ఆత్మనిర్భరత కోసం శాస్త్ర విజ్ఞానం–వికసిత్ భారత్ నిర్మాణానికి పిలుపు ’ అనే అంశంతో నిర్వహించిన కార్యక్రమానికి హైదరాబాద్ డిఆర్‌డిఎల్‌ డైరెక్టర్ డాక్ట‌ర్‌ అంకతి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో పరిశోధనా సంస్థల మధ్య సమన్వయం కీలకమని అన్నారు. డీఆర్డీఎల్, సీఎస్ఐఆర్–ఐఐసీటీలు పరస్పర సహకారంతో పనిచేస్తే సాంకేతిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాల్లో సంయుక్త పరిశోధనలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చేపట్టే పరిశోధనలు దేశ ప్రగతికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

ఐఐసీటీ డైరెక్టర్ డాక్ట‌ర్‌.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… వికసిత్ భారత్ లక్ష్య సాధనకు శాస్త్రీయ ఆలోచన, ఆవిష్కరణలు, బాధ్యతతో కూడిన పరిశోధనలు అవసరమని అన్నారు. సంస్థలో నూతనంగా చేరిన శాస్త్రవేత్తలు, సిబ్బంది సీఎస్ఐఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ తమ పరిశోధనల ద్వారా సమాజానికి ఉపయోగపడే ఫలితాలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా సీఎస్ఐఆర్–ఐఐసీటీలో 25 సంవత్సరాలుగా సేవలందించిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page