యునాని, ఆయుర్వేద వైద్యం, మందులతో అన్ని రకాల వ్యాధులకు నివారణ

యునాని, ఆయుర్వేద వైద్యం, మందులతో అన్ని రకాల వ్యాధులకు నివారణ
– చౌదరి డిస్పెన్సరీ నిర్వాహకులు డాక్టర్ హకీమ్ ఇస్మాయిల్ ఖాన్ చౌదరి

హైద‌రాబాద్‌, జూన్ 19, ( అద్దం న్యూస్ ) :   యునాని, ఆయుర్వేద వైద్యం, మందులతో అన్ని రకాల వ్యాధులకు నివారణ జరుగుతుందని చౌదరి డిస్పెన్సరీ నిర్వాహకులు డాక్టర్ హకీమ్ ఇస్మాయిల్ ఖాన్ చౌదరి అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ విద్యానగర్ ఏఆర్‌కె పిజి కాలేజీ ఎదురుగా నూతనంగా చౌదరి డిస్పెన్సరీ యునాని, ఆయుర్వేద క్లినిక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎంఏ.వాహిద్ అలీ హాజరయ్యారు. ఈ ఆయన చౌదరి డిస్పెన్సరీ నిర్వాహకులు డాక్టర్ హకీమ్ ఇస్మాయిల్ ఖాన్ చౌదరి తో కలిసి క్లినిక్ ను వాహిద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌదరి డిస్పెన్సరీ నిర్వాహకులు డాక్టర్ హకీమ్ ఇస్మాయిల్ ఖాన్ చౌదరి మాట్లాడుతూ… హైదరాబాద్ ఫీల్ ఖానా లో పుట్టిన తాను 1973 నుండి తాను 53 ఏళ్లుగా యునాని, ఆయుర్వేదంలో వైద్యం చేస్తున్నానని తెలిపారు.

మహారాష్ట్ర కోలాపూర్ లో 35 ఏళ్ల పాటు క్లీనిక్‌ను న‌డిపాన‌ని, అదే విధంగా హైదరాబాద్ ఫీల్ ఖానా లో క్లినిక్ పెట్టి యునాని, ఆయుర్వేద వైద్యాన్ని అందచేశానన్నారు. యునాని, ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవన్నారు. అధిక బ‌రువును తగ్గించేందుకు, కిడ్నీల్లో రాళ్లను తొలగించేందుకు, సెక్స్‌లో త్వ‌ర‌గా స్కలనం కాకుండా వైద్యం చేసి మందులను ఇస్తామన్నారు. ఈ రోజుల్లో ఇంట‌ర్‌నెట్ పెరిగి రేడియేష‌న్ వ‌ల్ల కావొచ్చు… జంక్ ఫుడ్ తిన‌డం వ‌ల్ల కావొచ్చు.. ఆల‌స్యంగా పెళ్లిలు చేసుకోవ‌డం కావొచ్చు… త‌దిత‌ర అనేక‌ కారణాల వల్ల మ‌గ‌వారు దాంపత్య జీవితంలో సెక్స్ సరిగ్గా చేయలేపోతున్నారని, అటువంటి వారికి వైద్యం, మందులను ఇస్తామన్నారు. కొంత ఆలస్యమైన కానీ.. తప్పకుండా అన్ని ఆరోగ్య సమస్యలు న‌యం అవుతాయన్నారు. పిల్లలు పుట్టకపోతే కూడా మా వద్ద వైద్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాకీర్, షేక్ సమీర్, సయ్యద్ సలీం, ఇర్ఫాన్ బేగ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహ్మద్ ఖదీర్, ఖలీల్, అహ్మద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page