హైదరాబాద్, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన లోయర్ ట్యాంక్బండ్ శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ జి.గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్, ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ లు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో మహోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 11వ తేదీ ( నేటి ) నుండి 20వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారిని విశేషాలంకరణతో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 11వ తేదీన అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అలంకరిస్తామన్నారు 12 వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో, 13 వ తేదీన శ్రీ మంగళ గౌరీ దేవి రూపంలో, 14 వ తేదీన గాయత్రీ దేవి రూపంలో, 15 వ తేదీన మహాలక్ష్మి దేవి రూపంలో, 16 వ తేదీన శ్రీ సరస్వతి దేవి రూపంలో, 17 వ తేదీన శ్రీ లలితాదేవి రూపంలో, 18 వ తేదీన శ్రీ దుర్గాదేవి రూపంలో, 19 వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో, 20 వ తేదీన మహిషాసుర మర్దిని దేవి రూపంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తామన్నారు. అలాగే 11 నుంచి 20వ తేదీ వరకు ప్రతి రోజు శ్రీ పంచామృతాభిషేకం, ఖడ్గమాలార్చన, బాలభోగం, కలశస్థాపన, శ్రీ లలితా సహస్రనామార్చాన, చంఢీ హోమం, మహానివేదన మంత్రపుష్పము, ప్రత్యేక అలంకరణ ఉభయదాతల పూజలు, హారతి మంత్ర పుష్పము ద్వారబంధనము తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో 11 వ తేదీ ( నేటి ) నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
RELATED ARTICLES
