Saturday, October 17, 2026
No menu items!
Homeculturalsశ్రీ సాయి రెసిడెన్సిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు....

శ్రీ సాయి రెసిడెన్సిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు….

📰 Generate e-Paper Clip

కాచిగూడ, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) :   

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు నిలుస్తాయి. శనివారం రాత్రి అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం గోల్నాకలోని శ్రీ సాయి రెసీడెన్సీ ఆధ్వర్యంలో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయ పద్దతిలో సహజ సిద్ధంగా తయారు చేసిన బతుకమ్మ వేడుకలను మహిళలు అట్టహాసంగా నిర్వహించారు. తెలంగాణ విశిష్టతలు, సంస్కృతి, సంప్రదాయాలకు నేటి యువతరానికి తెలియజేయాలని శ్రీ సాయి రెసిడెన్సి మహిళలు సూచించారు. ఈ కార్యక్రమంలో బోగ వెంకటమ్మ, చందనశర్మ, పి. రమాదేవి, మేకల లలిత, ఝాన్సీ, సువర్ణతో పాటు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page