Saturday, October 17, 2026
No menu items!
Homedevotionalవివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో శ్రీ గాయ‌త్రీ దేవిగా అమ్మ‌వారి అలంక‌ర‌ణ‌

వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో శ్రీ గాయ‌త్రీ దేవిగా అమ్మ‌వారి అలంక‌ర‌ణ‌

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్‌, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :   

ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో నెల‌కొల్పిన అమ్మ‌వారిని బుధ‌వారం శ్రీ గాయ‌త్రీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌హానివేద‌న‌, మంగ‌ళ‌హార‌తి, మంత్ర‌పుష్పం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, పారాయ‌ణం, ఆర‌గింపు, తీర్థ ప్ర‌సాద విత‌ర‌ణ త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అన్న‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి పి.కొమ్మాలు, ఆల‌య పున‌ర్నిర్మాణ క‌మిటీ చైర్మ‌న్ జానకి సుధాక‌ర్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు బుగ్గా ల‌క్ష్మీప‌తి శ‌ర్మ‌, అర్చ‌కుడు కందాల వేంక‌టాద్రి, దేవాల‌య పున‌ర్నిర్మాణ క‌మిటీ స‌భ్యులు, ఆల‌య సిబ్బంది, భ‌క్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page