సికింద్రాబాద్, అక్టోబర్ 14, ( అద్దం న్యూస్ ) :
సికింద్రాబాద్ పరిధిలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చెయ్యాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిలకలగూడలోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ దేవాలయాన్ని ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగకు ప్రాముఖ్యత ఉందని, ప్రజలు ఆనందంగా పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన సొంత ఖర్చుతో అన్న ప్రసాద పంపిణీని పద్మారావు గౌడ్ నిర్వహించారు. బీఆర్ఎస్ యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, ఆలయం చైర్మన్ గుంటి కృష్ణ, కార్యనిర్వహణాధికారి మహేందర్ గౌడ్ తో పాటు పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.![]()
