Sunday, September 20, 2026
No menu items!
HomeNationalకాలుష్య కోరల్లో దేశ రాజధాని..

కాలుష్య కోరల్లో దేశ రాజధాని..

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) సమస్య మరోసారి తీవ్ర రూపం దాల్చింది. శీతాకాలం ప్రారంభం కావడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. తాజా వివరాల ప్రకారం, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించిన దాని ప్రకారం, దిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 387గా నమోదైంది. ఈ స్థాయి ‘చాలా ప్రమాదకరం’ (Very Poor) కేటగిరీకి చెందుతుంది.

అత్యంత ప్రభావిత ప్రాంతాలు

దిల్లీలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయులు అత్యంత తీవ్రమైన జోన్‌లోకి (Severe – 400+) ప్రవేశించాయి. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు గుర్తించిన 18 ప్రాంతాల్లో AQI 400 కంటే ఎక్కువగా నమోదైంది. అత్యధికంగా కాలుష్యం నమోదైన కొన్ని ప్రాంతాలు:

వివేక్ విహార్: 437

వజీర్‌పూర్: 443

ఆనంద్ విహార్: 434

జహంగీర్‌పురి: 439

నరేలా: 425

బవానా: 424

నోయిడా: 422

ఈ ప్రాంతాల్లో AQI 400 దాటడం అంటే, ప్రజారోగ్యానికి తక్షణ ముప్పుగా పరిగణించే ‘తీవ్రమైన’ (Severe) జోన్‌లోకి చేరినట్లే. పొగమంచు, విమాన ప్రయాణాలపై ప్రభావం.. శనివారం తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు (స్మాగ్) కప్పివేయడంతో దృశ్యగోచరత (Visibility) గణనీయంగా తగ్గింది. దీనిపై స్పందించిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతానికి విమాన సర్వీసులు సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ, ప్రయాణ సమయాల్లో ఏమైనా మార్పులు ఉంటే తెలుసుకోవడానికి ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలతో సంప్రదించాలని సూచించింది. నగరంలో కాలుష్య స్థాయులు పెరుగుతున్న నేపథ్యంలో, నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేస్తున్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page