హైదరాబాద్, మే 30, అద్దం న్యూస్ : సినీ నటుడు బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టిడిపి నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా పేద రోగులకు, క్యాన్సర్ పీడితులకు చికిత్స నిర్వహిస్తూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఎంతో అభివృద్ది చేసి దేశంలోనే గొప్ప ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ఘనుడు నందమూరి బాలకృష్ణ అని అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నందమూరి బాలకృష్ణ సేవా నిరతిని, నట కౌశలాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో 50 సంవత్సరాలు నటుడిగా, తండ్రి తగ్గ తనయుడిగా రాణించి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టిఆర్ ప్రమేయం లేకుండా రాజకీయాలకు అతీతంగా స్వశక్తితో ఎదిగి, సినిమా రంగంలో రాణిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ అని అన్నారు. సినీ కళాకారునిగా ఈనాటికి కూడా తెలుగు చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యునిగా ప్రజాభిమానంతో మూడుసార్లు హ్యాట్రిక్ సాధించిన నందమూరి బాలకృష్ణ ఎవరి ప్రలోభాలు లోనుకాకుండా తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్నారన్నారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply