కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న
డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి దంపతులు
హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి దంపతులు ఆదివారం సిద్దిపేట్ జిల్లా కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి మాట్లాడుతూ… కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తి కలుగుతుందని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. దేవస్థాన పరిసర ప్రాంతాల శుభ్రత, సౌకర్యాలు మెరుగ్గా ఉండడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవస్థాన అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply