అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి – అంబ‌ర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

కాచిగూడ, మే 26, అద్దం న్యూస్ :   నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అంబ‌ర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాచిగూడ డివిజన్ లో రహమత్‌బాగ్‌లో సుమారు 22 లక్షల రూపాయ‌ల‌ అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు పనులను కాచిగూడ కార్పొరేటర్ కన్నా ఉమా రమేష్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ … నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిఈ ప్రవీణ్, వాటర్ వర్క్స్ డీజిఎం కృష్ణ, ఏఈలు భావన, ప్రవీణ్, డివిజన్ అధ్యక్షుడు భీష్మ దేవి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శిరీష, ఓం ప్రకాష్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page